కత్తెరపల్లి బెల్టుషాపును రద్దు చేయాలి: జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్

*నియోజకవర్గంలో మద్యపానం నిషేధిస్తే డిప్యూటీ సీఎంకి గుడి కడతాం
*ప్రజల ప్రాణాలు ముఖ్యమా..? మద్యం షాపు ముఖ్యమా..?

కార్వేటినగరం మండలం, కొల్లాగుంట గ్రామం వద్ద ఉన్న బెల్ట్ షాప్ ను కత్తెరపల్లి గ్రామానికి మార్చడం సరైనది కాదని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమా లేక మద్యం షాపులు ముఖ్యమా అని ఎద్దేవా చేశారు. కత్తెరపల్లిలో ఏర్పాటు చేస్తున్న బెల్ట్ షాప్ నిర్మాణాన్ని, అక్కడ ప్రారంభించనున్న బెల్ట్ షాప్ ను తక్షణమే ఆపి, ప్రజా ప్రయోజనార్థమైన పనులు చేయాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఈ సందర్భంగా తెలిపారు. ఇక్కడ బెల్టుషాపులు కొనసాగిస్తే చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలు నిర్వహిస్తామని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి చొరవ తీసుకుని ఈ ప్రాంతాన్ని మద్యరహిత ప్రాంతంగా చేయాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ నియోజకవర్గం నుండే మద్యపానం నిషేధించడం కలిగితే డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నియోజకవర్గంలో పాలభిషేకం చేసి, ఒక గుడి కడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల ఉపాధ్యక్షులు మహేష్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, భగత్సింగ్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ సాయి కుమార్, జితేంద్ర, జనసైనికులు పాల్గొన్నారు.