*ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించిన తగరపు శ్రీనివాస్
జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పైన బి.ఆర్.ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. లిక్కర్ కేసులో ఆరు నెలలకు పైగా జైలులో ఉండి, దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర పరువును తీసిన కవిత గారు మాట్లాడడం చాలా హాస్యాస్పదం అని అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు అని డిప్యూటీ సీఎంగా అనుకోకుండా అయ్యారని అన్న వ్యాఖ్యలకు శ్రీనివాస్ స్పందిస్తూ, పది సంవత్సరాలు ఓటమిలో ఉన్నా ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులు ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేసారని, పవన్ కళ్యాణ్ గారు ప్రజా బలంతో ఉపముఖ్యమంత్రి అయ్యారని, ఎం పి గా పోటీ చేస్తే ప్రజలు ఓడిస్తే, మేనేజ్మెంట్ కోటలో ఎం.ఎల్.సి అవ్వలేదన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని వారి మన్నలను పొంది దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడు లేని విదంగా పోటీ చేసిన ప్రతి చోట 100%స్ట్రైక్ రేట్ తో ప్రజలు గెలిపించారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు.
Share this content:
Post Comment