దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

దుబ్బాక ఉప ఎన్నికలు జరుగనున్న నేపధ్యం లో ఈ స్థానం నుండి టీఆర్ఎస్ తరపున తమ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రామలింగారెడ్డి భార్య సుజాత పేరుని ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత లేదా కుమారుడు సతీష్‌రెడ్డికి టికెట్‌ దక్కడం దాదాపు ఖాయమనే ప్రచారం జరిగింది. చివరికి రామలింగారెడ్డి భార్య సుజాత పేరుని కేసీఆర్ ఖరారు చేశారు.

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నిర్వహణ అనివార్యత ఏర్పడింది. దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నికల రాజకీయం వేడి రగులుతుంది.