రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుక అని కేసీఆర్ చెప్పారు. లక్ష్యసాధనలో విశ్రమించకూడదనేది దసరా ఇచ్చే స్ఫూర్తి అన్నారు. చెడుపై మంచి విజయానికి సంకేతమే విజయదశమి అని వివరించారు. ఈ దసరా సందర్భంగా అందరికీ ఆరోగ్యం, సిరిసంపదలు కలగాలని ఆయన ప్రార్థించారు.