నారాయణ స్వామీ నోరు అదుపులో పెట్టుకో: శోభన్ బాబు

నారాయణ స్వామీ వ్యాక్యలను ఖండిస్తూ.. జనసేన నాయకులు శోభన్ బాబు మాట్లాడారు.. కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఉప ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తే .. మేము మీ వ్యక్తిగతం గురించి ఈ రాష్ట్రానికి తెలియజేస్తాం..

ఆడవాళ్లను మాతృమూర్తులుగా భావిస్తున్నాము గనుకనే మాకు సంస్కారం అడ్డు వస్తుంది మీ గురించి మాట్లాడడానికి.

అయన మూడు పెళ్లిళ్ల గురించి మీ కెందుకు??..

గడప గడపలో మొక్కుబడులు చేసుకుంటూ అభివృద్ధి ఊసెత్తని మీ నైజం.. ఏమీ సాధించావని గడప గడపకు వెళ్తావు??

ప్రజలకు నువ్వు చేసింది ఏమీ లేదు.. లేని వారికీ మొండి చేయి,
ఉన్నోడికి ఉంగరం చేయి..!

మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక్క గ్రామాన్నైనా ఆదర్శవంతమైన గ్రామంగా మార్చావా ??

ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం మట్లాడితే నీ ఇంటిని మూడువేల మంది జనసైనికులతో ముట్టడిస్తాం..

నీ ఓటమి ఖాయమని తెలిసి, జనసేన గెలుపు తధ్యమని అతి వాగుడు వాగుతున్నావు.. నిన్ను ఓడించి, శాశ్వతంగా ఇంట్లో కూర్చోబెడతాం..

పిల్లికి కూడా బిక్షం పెట్టని నువ్వా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది..

సమస్యలపై ప్రశ్నించిన వారిపై రాజకీయాన్ని ఆపాదిస్తూ అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నావు..

ఇది ఒక రకంగా నీ రాజకీయ సమాధికి పునాదులు తవ్వుకుంటున్నారన్నది అతిశయోక్తి కాదు..

మా నాయకుడు కోట్లాది రూపాయలు నిరుపేదలకు, మీ నిరంకుశ వైఖరి వల్ల ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతులకు సహాయం చేస్తున్నారు..

ఖబడ్దార్ మాటలు వెనక్కితీసుకో.. ఇదే చివరి ఎన్నికలు నీకు.. అని జనసేన నాయకులు శోభన్ బాబు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *