పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకో..

*పేర్ని నానికి బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఘాటు హెచ్చరిక

మనుబోలు, సర్వేపల్లి నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పేర్ని నానిపై సర్వేపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనుబోలు మండలంలో జనసేన మండల నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత పేర్ని నానికి లేదు. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన వ్యక్తి పవిత్రమైన ప్రజా నాయకులపై విమర్శలు చేయడం సిగ్గుచేటు” అని ధ్వజమెత్తారు. పేర్ని నాని గతంలో బియ్యం గోదాముల్లో దాచడం, సతీమణి పేరుపై అక్రమంగా నిల్వ చేయడం వంటి దారుణాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపే కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసి, వైసీపీ శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తోందని బొబ్బేపల్లి సురేష్ నాయుడు విమర్శించారు. “మీ అధినేత జగన్ చెప్పినట్టుగా ఆయుధాల బెదిరింపులు చేసే స్థాయికి దిగజారిన నీవు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు గానీ, నాయకత్వం గానీ విమర్శిస్తే పళ్లే రాలిపోతాయి” అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, మహేష్, ఖాదర్ వల్లి, జాకీర్, ఉదయ్, సురేష్, కాగితాల పోరు మహేష్, కిరణ్, కంటే సుధాకర్, రా రా సందూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment