ప్రాణ త్యాగం చేసిన జవాన్ల కోసం నేను సైతం అంటూ కీర్తి నాయుడు సైకిల్ యాత్ర

కొండపి, 14 ఫిబ్రవరి వీరజవాన్ల దినోత్సవం సందర్భంగా, అమరవీరుల జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ ఒంగోలు నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర ప్రారంభించిన కీర్తి నాయుడుకి కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, జరుగుమల్లి మండలం అధ్యక్షులు గూడా శశిభూషణ్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్, టంగుటూరు మండల నాయకులు లింగంగుంట చంద్రవాస్, పొన్నలూరు మండల నాయకులు కర్ణ తిరుమలరెడ్డి స్వాగతం పలికి, సైకిల్ యాత్రకు సరిపడా వసతులు ఏర్పాటు చేశారు. అతని జీవిత ఆశయం లక్ష్యం అయినటువంటి ఎవరెస్టు శిఖరాన్ని త్వరలో అధిరోహించి విజయం సాధించటానికి జనసేన పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు. కీర్తి నాయుడుకి స్వాగతం పలికిన వారిలో గుంటుపల్లి శ్రీను, కిరణ్ బాబు, షేక్ కాజాహుస్సేన్, కాసుల శ్రీను, రాజా, ప్రవీణ్, మోహన్, కోటి మరికొంతమంది జనసైనికులు పాల్గొన్నారు.