పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి

*రోడ్ల బాగు కోసం తెచ్చిన ఆరు వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి
*రాష్ట్రానికి ప్రతి నెలా రోడ్డు టాక్స్, పెట్రోల్ టాక్స్ రూపేణా 750 కోట్ల రూపాయల ఆదాయం ఉంది
*రోడ్ల అభివృద్ధి కోసం వాడాల్సిన నిధులన్నీ ఏమయ్యాయి
*రాష్ట్రంలో అధ్వాన్నంగా తయారై ఉన్న రోడ్లకి “జగనన్న రోడ్లు” అని నామకరణం చేయాలి
*గాల్లో తిరుగుతూ రోడ్లను పట్టించుకోకుండా నిద్ర నటిస్తున్న సీఎం జగన్ రెడ్డి గారిని మేల్కొల్పేందుకే జనసేన పార్టీ #GoodMorningCMSir గుడ్ మార్నింగ్ సీఎం సార్” సోషల్ మీడియా క్యాంపెయిన్
*పవనన్న ప్రభుత్వంలో ప్రధాన రోడ్లతో పాటు నగరాలు, పట్టణాల్లోని లింకు రోడ్లు, మారుమూల గ్రామాల్లోని వీధి రోడ్లను కూడా చక్కగా అభివృద్ధి చేస్తాం
*పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 59వ రోజున 39వ డివిజన్ మూలాపేట, రొట్టెల వీధి ప్రాంతంలో జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించిన కేతంరెడ్డికి పలువురు తమ సమస్యలను విన్నవించగా కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమ వంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్గించారు.

ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారై ఉన్నాయని అన్నారు. రాష్ట్ర రహదారులు మొదలు, గ్రామాల్లో రోడ్లు, పట్టణాల్లో వార్డుల్లోని రోడ్ల దుస్థితి ఘోరంగా తయారై ఉందని విమర్శించారు. పాడైన రోడ్లన్నింటినీ జులై లోపు బాగు చేస్తామని గతంలో తాము డిజిటల్ క్యాంపెయిన్ చేసిన సందర్భంలో సీఎం జగన్ రెడ్డి గారు పత్రికల్లో పెద్ద ప్రకటనలు ఇచ్చి మరీ చెప్పారని, కానీ వాస్తవంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు. హెలికాఫ్టర్ లో గాల్లో తిరుగుతూ నేలను మర్చిపోయిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు రోడ్లను బాగు చేసే విషయంలో తనకేమి పట్టనట్టు నిద్ర నటిస్తున్నారని, ఆయన్ని మేల్కొపేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జూలై 15, 16, 17 తేదీలలో #GoodMorningCMSir “గుడ్ మార్నింగ్ సీఎం సార్” అనే హాష్ టాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ చేపడుతున్నాం అని అన్నారు. రాష్ట్రానికి రోడ్డు టాక్స్ ల నుండి, పెట్రోల్ టాక్స్ ల నుండి నెలకు 750 కోట్ల రూపాయల ఆదాయం ఉందని, ఈ ఆదాయాన్ని చూపించి రోడ్ల అభివృద్ధి కోసమంటూ బ్యాంకుల నుండి 6000 కోట్ల రూపాయల అప్పుని కూడా తెచ్చారని, ఆ నిధులన్నీ ఏమైపోయాయని కేతంరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రతి పథకానికి ముందు జగనన్న అనే పేరుని పెడుతున్నారని, అదేవిధంగా రాష్ట్రంలో అధ్వాన్నంగా తయారైన రోడ్లన్నింటికీ “జగనన్న రోడ్లు” అని నామకరణం చేయాలని కేతంరెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వానికి రోడ్లను బాగు చేయడం చేతకాక పోతే రానున్న పవనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రతి రాష్ట్ర ప్రధాన రహదారితో పాటు, నగరాలు, పట్టణాల్లోని లింకు రోడ్లు, మారుమూల గ్రామాల్లోని వీధి రోడ్లను కూడా చక్కగా అభివృద్ధి చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.