బొలిశెట్టి సమక్షంలో జనసేనలో చేరిన కీలక నేతలు

  • వైసీపీ నుంచి జనసేనలోకి భారీ చేరికలు,

తాడేపల్లిగూడెం: మండలం వెంకటరామన్నగూడెంలో వైసీపీ నుంచి జనసేనలోకి మంగళవారం నీలపల దినేష్ మరియు అడపా ప్రసాద్ అధ్యక్షతనలో భారీ చేరికలు జరిగాయి. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతులమీదుగా వైసీపీ ఎంపీటీసీ, వార్డు నెంబర్, మరియు సీనియర్ నాయకులు, వారి అనుచరులు 50 మందికి పైగా జనసేన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అధికార వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీలో మొదటి నుండి ఉంటున్న వాళ్లకు అన్యాయం జరుగుతుందనీ, పార్టీ కోసం కష్టపడిన వారిని వైసీపీ చిన్న చూపు చూస్తుందని, ఈ నాలుగున్నర ఏళ్లలో జగన్ ప్రభుత్వంతో తీవ్ర నష్టాలలో మిగిలిపోయిందనీ ప్రజల సమస్యలపై పవన్ కళ్యాణ్ పోరాటం చూసే జనసేన లోకి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుతున్నట్టు తెలిపారు. అంతే కాకుండా కొట్టు సత్యనారాయణ గురించి మాట్లాడుతూ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో తాడేపల్లిగూడెం పట్టణానికి మరియు గ్రామాలకి వైసీపీ ప్రభుత్వం నుంచి అభివృద్ధి పనులు చేసింది ఏమీ లేదని, రోడ్ల పరిస్థితి, ఇసుక దోపిడి, “కే”టాక్స్, వంటివి ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని, మోసపూరిత మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరని వివరించారు. ఈ కార్యక్రమంలో నీలపాల వీరాస్వామి, అయినపర్తి శ్రీనివాస్, మరిడి కృష్ణారావు, నీలపాల సత్యనారాయణ, మువ్వ శ్రీను, అడ్డాల శివ, నీలపాల గణేష్, బూర్ల భవాని, వెంపల సాయి, అడపా గంగాధర్, మణికొండ కిరణ్ మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.