రాజ్యాంగనిర్మాతకు నివాళులర్పించిన ఖమ్మం జనసేన

ఖమ్మం, అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ తరుపున ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ రామకృష్ణ మిరియాల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ కలలు కన్న నవ సమాజాన్ని, సమ సమాజాన్ని స్థాపించడానికి, ఆయన ఏ ఆశయంతో రాజ్యాంగాన్ని రచించారో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుని వెళ్లే విధంగా జనసేన పార్టీ తరుపున పోరాడతాం అని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా,నగర నాయకులు మెడబోయిన కార్తిక్, యాసంనేని అజయ్ కృష్ణ, బాణోత్ దేవేందర్, తుడుం ఉత్తమ్ రాజు, విజయ, నాగుల్ మీరా, శ్రీనివాసరావు, రంజిత్, వరప్రసాద్, నరేష్, హరి, సురేష్, సతీష్, నరసింహారావు, రాజేష్, సతీష్, బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.