కిడ్నాప్ దాడిని ఖండించిన జనసేన

*జనసేన నాయకుడు శ్రీపతి రాము కుమారుడి కిడ్నాప్
*దోషులకు కఠిన శిక్షలకోసం డిమాండ్
*నెల్లూరులో రౌడీయిజం దాటి కిడ్నాప్ సంస్కృతిని అరికట్టాలి
*కిషోర్ గునుకుల-జనసేన

నెల్లూరు, జనసేన నాయకుడు శ్రీపతి రాము కుమారుడిపై జరిగిన కిడ్నాప్, దాడి ఘటనను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో నెల్లూరులోని సీఐని కలిసి, దోషులెవ్వరైనా వారిపై కఠినమైన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని జనసేన నేత గునుకుల కిషోర్ నేతృత్వంలోని నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన గునుకుల కిషోర్, “నెల్లూరులో రౌడీయిజం మరీ దాటి కిడ్నాప్ సంస్కృతి పెరుగుతోందని ఇది ఆందోళనకరం. ప్రజలు స్వేచ్ఛగా జీవించాల్సిన వాతావరణాన్ని వైసీపీ పాలనలో నాశనం చేశారు. అదే పరిస్థితులను మళ్లీ తెచ్చే ప్రయత్నం చేస్తే సహించం,” అని స్పష్టం చేశారు. ఈ వినతిలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్‌తో పాటు రూరల్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందరరామిరెడ్డి, కార్యాలయ ఇన్‌ఛార్జ్ జమీర్, సీనియర్ నాయకులు రవికుమార్, పేనేటి శ్రీకాంత్, సుల్తాన్, బాలు, కృష్ణమోహన్ రెడ్డి, హేమచంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ న్యాయ పోరాటానికి కట్టుబడి ఉండి, బాధితులకు న్యాయం జరిగే వరకు నిద్రపోమని స్పష్టం చేసింది.

Share this content:

Post Comment