విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కిమిడి నాగార్జున

*కిమిడి నాగార్జునకి అభినందనలు తెలియజేసిన చీపురుపల్లి జనసేన నాయకులు
విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నియమితులైన కిమిడి నాగార్జున ని, చీపురుపల్లి పట్టణంలోని ఆయన నివాసంలో జనసేన పార్టీ చీపురుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు, గుర్ల మండల అధ్యక్షులు యడ్ల సంతోష్, జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ కోట్ల కృష్ణ, అలాగే జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విసినిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “తెలుగుదేశం పార్టీకి కఠినకాలంలో అండగా నిలిచి, ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి పాటుపడ్డ యువ నాయకుడు నాగార్జున గారిని పార్టీ అధిష్ఠానం జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవికి ఎంపిక చేయడం ఆనందదాయకం,” అని పేర్కొన్నారు. అలాగే, “రైతుల అభివృద్ధికి కృషి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని, అందరికీ అందుబాటులో ఉండే నేతగా జిల్లా రైతులకు మేలు కలిగించే విధంగా సేవలందిస్తారని విశ్వాసం ఉందని,” తెలిపారు. నిష్కళంక సేవా తత్త్వంతో పనిచేస్తున్న కిమిడి నాగార్జున గారికి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు లభించాలని నేతలు ఆకాంక్షించారు.

Share this content:

Post Comment