బెంతు ఒరియాల నిరహారదీక్షకు దాసరి రాజు మద్ధతు

ఇచ్చ్చాపురం: బెంతు ఒరియా కులస్థులకు జరుగుతున్న అన్యాయం పట్ల కవిటిలో వారు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి. బొరివంక గ్రామ బెంతు ఒరియాలు ఈ రోజు దీక్షలో పాల్గొన్నారు.ఈ దీక్షకు ఇచ్ఛాపురం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీ దాసరి రాజు జనసేన నాయకులతో కలిసి దీక్షా శిబిరం వద్దకు వెళ్లి పూల మాల వేసి మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ ప్రజలందరూ సంక్రాంతి పండుగ చేసుకుంటూ సంతోషంగా ఉన్నారని, ఇలాంటి పండగ రోజును కూడా పక్కన పెట్టి బెంతోరియా లు వారి హక్కులు కోసం ఈ రోజు నిరాహార దీక్షలు కు కూర్చొని పోరాటం చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ఈ సమస్య పరిష్కారం చేసి బెంతొరియాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బెంతొరియా కుల పెద్దలు మాట్లాడుతూ మా సమస్య పట్ల చిత్తశుద్ధితో ఉంటూ ఎప్పటికీ అప్పుడు మేము చేస్తున్న పోరాటంలో మద్దతు తెలుపుతున్న జనసేన పార్టీ ఇంఛార్జి దాసరి రాజుకి ధన్యవాదాలు తెలిపారు. నూతన సంవత్సరం రోజున చేపట్టిన ర్యాలీలో కూడా దాసరి రాజు పాల్గొని మద్దతు తెలిపిన విషయం విదితమే. అలాగే విషయాన్ని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళతానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచిలి మండల అధ్యక్షులు డొక్కరి ఈశ్వర్ రావు, కర్రి మన్మధ, లోళ్ళ ధనుంజయ్, యర్ర మధు, నాగరాజు, అనీల్ తదితరులు పాల్గొన్నారు.