బ్రహ్మాస్త్ర పూర్తి చేసిన కింగ్ నాగార్జున

టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున బ్రహ్మాస్త్ర మూవీ షూటింగ్ ను పూర్తి చేసాడు. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ హిందీ, తెలుగు, క‌న్న‌డ‌, మలయాళ, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ లో నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ సందర్భంగా ‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌తో ప్రయాణంపై స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు నాగార్జున.

తన క్యారెక్టర్‌కు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకున్నానని తెలుపుతూ నాగార్జున ట్వీట్ చేస్తూ.. అయాన్ ముఖర్జీ, రణ్‌భీర్‌ కపూర్‌, ఆలియా భట్‌లతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. రణ్‌భీర్ కపూర్‌, ఆలియా భట్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందని, ఇదో అద్భుతమైన అనుభవమని పేర్కొన్నారు. అయాన్‌ ముఖర్జీ రూపొందించిన అద్భుతమైన ప్రపంచాన్ని చూడాలని చాలా ఆతృతగా ఉందని తెలిపారు.