దర్శకుడిగా మారిన కిరాక్ ఆర్పీ

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్ కిరాక్ ఆర్పీ దర్శకుడిగా మారారు. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్‌పై కోవూరు అరుణాచలం నిర్మాతగా కిరాక్ ఆర్పీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ఆదివారం ప్రారంభమైంది. పద్మజ పిక్చర్స్ ఆఫీసులో జరిగిన పూజా కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు అతిథిగా విచ్చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నాగబాబుతో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్లు కూడా హాజరయ్యారు.

ఈ సినిమాలో జేడీ తో పాటు, ప్రకాష్ రాజ్, రావు రమేశ్, జబర్దస్త్ ఆదిత్య తదితరులు ఈ సినిమాలో నటిస్తునoడగా…  సాధ్యమైనంత త్వరలో హైదరాబాద్, నెల్లూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుoది.