మినిస్టర్ రోజాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కిరణ్ రాయల్

తిరుపతి, జనసేనలో సైకోలు ఉన్నారని చెప్పడం దారుణం. రాజకీయాల్లో రోజాకు పని అయిపోయిందని, సొంత నియోజకర్గంలో చక్క బెట్టుకొలేక ఉత్తరాంధ్రకు వెళ్ళడం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు. జనసేనతో పెట్టుకుంటే భవిష్యత్తు ఉండదని, జగన్ కు కోడి కత్తి తరహాలో వైకాపా నాయకులు రాళ్ల దాడి డ్రామాలు కలిసి వస్తాయని ఆశిస్తున్నారని, 2024 చివరి ఎమ్మెల్యే, మంత్రి నువ్వు మీ ఇంట్లోనే ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడుతున్నారట, ఇక రోజాకు కే ఏ పాల్ ఒక్కడే దిక్కని, సొంతంగా పోటీ చేస్తే నీకు అరటి పండే గుర్తని తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సమ్యుక్త కార్యదర్శి కీర్తన, జనసేన పార్టీ తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.