వైసీపీలో అసంతృప్తితో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులను జనసేనలోకి ఆహ్వానించిన కిరణ్ రాయల్

*అసంతృప్తితో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులూ వైసీపీలో ఉన్నారు – ఇదే సమయం జనసేనలోకి రండి కలిసి అభివృద్ధి చేద్దాం
*ఎమ్మార్వో, వీఆర్వో లు థియేటర్ల వద్ద కాపలా కాయడం చాలా బాధాకరం.
*భీమ్లా నాయక్ తో నాలుగు రాళ్ళు వెనకేసుకున్న వైసిపి నాయకులు
*అరచేతితో సూర్యుణ్ని ఆపలేరు – అధికార దుర్వినియోగంతో మా విజయాన్ని అడ్డుకోలేరు
*తప్పు చేస్తున్నామని మనో వేదనతో రెవెన్యూ అధికారులు…
*అఖండ, పుష్ప చిత్రాలు రోజుకు 5 షోలు… భీమ్లా నాయక్ కు మాత్రం 4 షోలే…

తిరుపతి, గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రజలను పీడించుకు తింటున్న, వైసిపికి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడే.. జనసేనాని పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అడ్డుగా ఉందని పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ రోజు నుంచి నేటి వరకు రెవెన్యూ అధికారులతో ఆంక్షల మధ్య దాడులు నిర్వహిస్తూ… ఎక్కడా జరగని కుట్ర రాజకీయాలకు వైకాపా అధిష్టానం పాల్పడుతున్నదని.. అరచేతితో సూర్యుని అడ్డుకోలేరని… అభిమానుల అభిమానం ముందు భీమ్లా నాయక్ చిత్ర విజయాన్ని ఆపలేరని జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానికి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, బాబ్జి, హేమ కుమార్, కీర్తన మరియు సుమన్ బాబు, మునస్వామి, శేషా, కృష్ణ లతో కలిసి కిరణ్ మాట్లాడుతూ.. ప్రజాభిమానం ఉన్న పవన్ కళ్యాణ్ ని అడ్డుకోలేక ఆయన నటించిన భీమ్లా నాయక్ ను అడ్డుకుంటూ ప్రజాగ్రహానికి రాష్ట్ర పాలక పార్టీ నేతలు గురవుతున్నారని, ఇది వారు గ్రహించాలని హెచ్చరించారు. వయసు మల్లి ఆరోగ్య సమస్యలతో ఉన్న రెవెన్యూ అధికారులు థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తూ, పాలకులను మనసులో తిట్టుకుంటూ, మనసులో పవన్ అభిమానులకు సారీ చెప్పుకుంటూ, రెవెన్యూ అధికారులు నరకం అనుభవిస్తున్నారని… ఇది ఇంకా ఎన్ని రోజులని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు… నెల్లూరు వైసిపి నేత .. భీమ్లా నాయక్ ఒక్క షో చిత్ర ప్రదర్శనను కొనేసుకుని… 500 రూపాయలకు టికెట్ అమ్మడం హాస్యాస్పదమన్నారు.