జగన్, రోజాలపై కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు

ఈన భార్యతో రాడు, ఆమె భర్తతో రాదు

కొడాలి నాని ఇది తిరుమల కొండ అనుకున్నావా, లేక గుడివాడలో నీ గుడి అనుకున్నావా – జనసేన, టిడిపి

తిరుపతి: తిరుమలలో పురోహితులు జగన్ కు తలపాగా కడుతున్న సమయంలో చిన్నపిల్లలు స్కూల్ యూనిఫామ్ వేసుకునేలా చాలా అమాయకంగా నటించారని, రాష్ట్రంలో రక్తపాతం సృష్టించినటువంటి మీ యొక్క నిజ జీవితం ప్రజలందరికీ తెలుసని, అంత అమాయకంగా నటించడం ఎందుకని, అక్షింతలతో స్వాములు ఆశీర్వదిస్తున్నప్పుడు వాటిని దులుపుకోవడం చూస్తుంటే పిచ్చి బాగా ముదిరిందని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మీ మానసిక స్థితి సరిగా లేదని మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముఖంగా టిడిపి నాయకులు ఆర్సి మునికృష్ణ, జనసేన నాయకులు హేమ కుమార్, రాజేష్ ఆచారి, రమేష్ నాయుడు, గుట్టా నాగరాజు, వంశీ తదితరులతో కలిసి కిరణ్ రాయల్ మాట్లాడారు. కొడాలి నాని టీటీడీ ఉద్యోగులపై దురుసుగా వ్యవహరించారని, ఇది తిరుమల అనుకున్నావా లేక గుడివాడలో మీరు కబ్జా చేసిన గుడి అనుకున్నావా ఇది మా అడ్డా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి రోజాకు సీటు లేదని, అది గ్రహించి మోకాళ్ళతో కూర్చొని మరీ జామకాయతో జగన్ ను కాకా పడుతుందని, తిరుమలకు వదిన ను తీసుకురమ్మని నువ్వైనా చెప్పాలి కదా అని, పళ్ళు రాల కొడతాను అంటున్నావు పోలీసులను పక్కనపెట్టి, నువ్వు వచ్చినా సరే లేదా నన్ను రమ్మన్నా సరే అని, నగిరి లో ఎలాగో ప్రజలు నిన్ను పట్టించుకోరు గుడిలో కూడా కూర్చునే దానికి నీకు సీటుకూడా లేదని, మా పవన్ కళ్యాణ్ ను జనసేన నాయకులను నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, పవన్ కళ్యాణ్ నీ పళ్ళు రాల కొడతాడని, అంటావా గతంలో నిన్ను చెన్నైలో సునీల్ రెడ్డి కుటుంబంతో తరుముకున్నాడని రోజాకు, కిరణ్ గుర్తు చేశారు. నిన్నటి రోజు గరుడ వారధి ఫ్లైఓవర్ ని సీఎం జగన్ ప్రారంభించారని స్థానిక ప్రజలు వారధిని చూసేందుకు వెళితే అనుమతించలేదని, ఏదో సినిమాలో చెల్లెకు మళ్లీ పెళ్లి అనేలా ఎన్నిసార్లు ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తిరుమల తిరుపతి జగన్ టూర్ ఒక సర్కస్ వాతావరణంలో జరిగిందని జనసేన, టిడిపి నాయకులు వైసీపీ ని ప్రశ్నించారు.