నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన కిరణ్ రాయల్

హైదరాబాద్: జనసేన పార్టీ కార్యాలయంలో పీ.ఏ.సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను మంగళవారం హైదరాబాద్ లో తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ పై వైసీపీలో కొందరు వ్యక్తులు ఆడవారిని అడ్డం పెట్టుకొని, ఆర్థికంగా, వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలను, అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చెయ్యాలన్న విషయాలను కిరణ్ రాయల్ వివరించారు. సమస్యలు తెలుసుకున్న పార్టీ పెద్దలు.. నాదెండ్ల మనోహర్ అధికార పార్టీకి చేతనైంది ప్రశ్నించే గొంతులను ఎన్ని రకాలుగా నొక్కాలో, ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చెయ్యాలన్న ఆలోచనలేనలేనని, వారు అభివృద్ధిపై దృష్టి సారించరని, ప్రజల కష్టాలు వారికి పట్టవని, రేపు రాబోయేది జనసేన – టిడిపి ఉమ్మడి ప్రభుత్వమేనని ఈ విషయం అధికార పార్టీ గుర్తు పెట్టుకోవాలని, జనసేన నాయకులను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని వారికి ఇవ్వవలసింది తప్పకుండా తిరిగి ఇస్తామని.. నువ్వు ఎక్కడ కూడా అధైర్య పడకుండా పార్టీ కోసం కృషి చేసి పార్టీ గెలుపుకు సహకరించి, తిరుపతి లో జనసేన జెండాను ఎగరవేసే దిశగా ముందుకు వెళ్లాలని, పార్టీ, అధినేత పవన్ కళ్యాణ్ అండదండలు ఎప్పుడు నీకు ఉంటాయని కిరణ్ రాయల్ కు నాదెండ్ల మనోహర్ హామీ ఇవ్వడం జరిగింది.