కిసాన్ మేళా

కొవ్వూరు నియోజకవర్గం, కొవ్వూరులో శనివారం కిసాన్ మేళా నిర్వహించడం జరిగింది. కొవ్వూరులో ఉన్న దేశంలో ఏకైక కేంద్ర అరటి పరిశోధన కేంద్రం వద్ద రైతులకు, విద్యార్థులకు అందరికి అరటి పంటలో ఉన్న అన్ని రకాలను, అలాగే సేంద్రియ ఎరువులతో పంట పండించే విధానం పద్దతులు అందరికీ శాస్త్రవేత్తలు తెలియచేయటం జరిగింది. అదే కాకుండా అన్ని రకాల పంటలు గురించి, ఉద్యాన వన పంటలు పండించే విధానం, విత్తనాలు ఇచ్చి పండీంచే విదానం తెలియచేయటం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూటమి ఎంఎల్ఏ ముప్పిడి వేంకటేశ్వరరావు, ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, చౌదరి, పెద్దలు మద్దిపాటి శివ రామకృష్ణ, నారాయుడు చిన్ని, మొదలైన బిజెపి జనసేన, టిడిపి నాయకులు మఖ్య అతిధిలుగా పాల్గోనటం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మేకల శ్రీను, పెరుగు పోతురాజు, కొప్పాక విజయ్ కుమార్, పెరుగు శివ వాసిరెడ్డి వేంకటేష్ కన్నప్ప మడిచర్ల నాగరాజు, పూటి జగదీష్ మొదలైన వారు, చుట్టూ ప్రక్కల గ్రామాల రైతులు, శాస్త్రజ్ఞులు, విద్యార్థులు, పాత్రికేయులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Share this content:

Post Comment