విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై స్పందించిన కిషన్‌రెడ్డి

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. నష్టాల్లో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను నడపడం భారమన్నారు. స్టీల్‌ప్లాంట్‌ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే కేంద్రం ఆలోచన చేస్తుందని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన తెలపవచ్చన్నారు.