బాధితులకు న్యాయం చేయాలని కిషోర్ గునుకుల వినతి

నెల్లూరు, మౌళిక వసతులు సరిగా కల్పించకుండానే నగరం నుంచి ఖాళీ చేయించి అల్లిపురం టిడ్కో ఇళ్లకి తరలించిన కుటుంబాల్లో కరెంటు మీటర్లు నేలపైనే ఉండడం, అవి డోర్స్ తీసి ఉండడంతో మరణించిన చిన్నారి కుటుంబ పరిహరం నిమిత్తం గత సంవత్సరం ఆగస్టు నెలలో కలెక్టర్ కి విన్నవించినప్పటికీ ఇప్పటికీ బాధితులని ప్రభుత్వం ఆదుకోలేదు. ఈ విషయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మార్వో అందుబాటులో లేకపోవడం డిప్యూటీ ఎమ్మార్వో దృష్టికి తీసుకువెళ్ళి బాధితులకు న్యాయం చేయాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల కోరడం జరిగింది.