నొ మై కాన్స్టిట్యూఎన్సీ 33వ రోజు

  • నొ మై కాన్స్టిట్యూఎన్సీ లో బాగంగా శేషమనాయుడు కండ్రిగ హరిజనవాడలో పర్యటించిన వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన నొ మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం తొట్టంబేడు మండలం, శేషమనాయుడు కండ్రిగ హరిజనవాడ గ్రామంలో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
అనంతరం గ్రామంలో ఉన్న వారికి నా సేన కోసం – నా వంతు కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని యువత పార్టీకి తమ వంతు విరాళం అందించి పార్టీకి వారి మద్దతు తెలపడం జరిగింది. గ్రామంలో డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు లేవని వర్ష కాలంలో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు, అర్హత ఉన్నా కూడా పేద వారికి ప్రభుత్వం నుండి ఇళ్లు మంజూరు కాలేదని కొంత మంది మహిళలు తెలిపారు. సమస్యలను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కొరకు పార్టీ తరఫున పోరాడుతామని వినుత గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల గోపి, నాయకులు రవికుమార్ రెడ్డి, ముడుసు గణేష్, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *