మనిషిని చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకెళ్ళే సాధనమే విజ్ఞానం.. ఎం.స్వరూప

  • అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం

విజయనగరం: అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని క్లబ్ వ్యవస్తాపక అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), క్లబ్ కార్యదర్శి కోయ్యాన లక్ష్మణ్ యాదవ్ నిర్వచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా గురజాడ స్కూల్, కరస్పాండంట్ శ్రీమతి ఎం. స్వరూప విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనిషిని చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకెళ్ళే సాధనమే విజ్ఞానం అని, సి.వి. రామన్ కాంతి కిరణాలపై పరిశోధన చేసి రామన్ ఎఫెక్ట్ కనుగొని మొదటి నోబెల్ బహుమతి సాధించిన మహానుభావుడు సి.వి.రామన్ అని, జీవితంలో సైన్సు ప్రాముఖ్యత ప్రజలకు అవగాహన.. విజ్ఞాన శాస్త్రాన్ని నేటి విద్యార్థులకు అందించడం నిజమైన జాతీయ విజ్ఞాన దినోత్సవమని విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. అనంతరం వందలాది విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తల జీవిత చరిత్రను డాక్యుమెంటరీ రూపంలో తెరపై చూపించారు. కార్యక్రమంలో గురజాడ స్కూల్ ప్రధాన ఉపాద్యాయులు పూడి శేఖర్, విజ్ఞాన ఉపాద్యాయులు పి.రమేష్, అనేకమంది విద్యార్థినీవిద్యార్థులు, గురజాడ స్కూల్ ఉపాద్యాయులు పాల్గొన్నారు.