కొడాలి నాని మీడియాతో మాట్లాడొచ్చు కానీ.. : హైకోర్టు

అమరావతి: పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడొచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఎన్నికల కమిషన్‌, ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయొద్దని, ప్రభుత్వ పథకాల గురించి మాత్రమే మాట్లాడొచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డివిఎస్‌ఎస్‌ సోమయాజులు స్పష్టంచేశారు. ఈనెల 21 వరకు మీడియాతో మాట్లాడకుండా నిలువరిస్తూ ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యేమార్గంగా తగిన ఉత్తర్వులు జారీచేస్తామని హైకోర్టు నిన్న తెలిపింది. ఈ మేరకు గురువారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.