బూతు భాషను రాష్ట్ర అధికార భాషగా మార్చిన ఘనుడు మంత్రి కొడాలి నాని

కొడాలి నాని క్యాసినోవా నానిగా, గడ్డం నాని గోవా నానిగా రూపాంతరం చెందారు. దారుణంగా సంస్కృతి సంప్రదాయాలును పండగ ముసుగులో నాశనం చేస్తూ గుడారాలు ఏర్పాటు చేసి గుడిసేటి పనులు చేస్తున్న మంత్రి కొడాలి నాని, అతని అనుచరుల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలి. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహేష్ మాట్లాడుతూ తెలుగు భాషకు తెగులు పట్టించి బూతు భాషను రాష్ట్ర అధికార భాషగా మార్చిన ఘనుడు మంత్రి కొడాలి నాని పచ్చనోట్ల కోసం పచ్చటి పల్లె వాతావరణాన్ని విష సంస్కృతితో సర్వనాశనం చేస్తూ, గుడివాడలోని కోడలి కన్వెన్షన్ సెంటర్లో క్యాసినోవా సెంటర్ను ఏర్పాటు చేసి, కోడలి నాని క్యాసినోవా నానిగా, గడ్డం నాని గోవా నానిగా రూపాంతరం చెందారు. పచ్చనోట్ల కోసం కక్కుర్తిపడి కరోనా నటిస్తూ హైదరాబాదులో దాక్కొని గుడివాడ నడిబొడ్డున గుడారాలు ఏర్పాటు చేసిన అందర్నీ పక్కదారి పట్టిస్తూ కోట్లాది రూపాయల అక్రమార్జన సంపాదిస్తున్నా మంత్రి కొడాలి నాని అతని అనుచరులు చేస్తున్న ఆగడాలపై రాష్ట్ర డిజిపి ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలి. డిజిపి ఒకసారి వారి చత్వారాన్ని చెక్ చేయించుకోవాలి. సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితేనే సీఐడీ పోలీసుల ద్వారా పోలీసుల ద్వారా కేసులు నమోదు చేసి విచారణ చేయించే మీరు, దారుణంగా సంస్కృతి సంప్రదాయాలును పండగ ముసుగులో నాశనం చేస్తూ గుడారాలు ఏర్పాటు చేసి గుడిసేటి పనులు చేస్తున్న మంత్రి కొడాలి నానిపై అతని అనుచరులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలి. ప్రభుత్వ పెద్దల అండదండలు లేకపోతే గుడివాడ నడిబొడ్డున గుడారాలు ఏర్పాటు చేసే దమ్ము ఎవరికి ఐన ఉంటుందా? ఎవరినడిగినా చెబుతారు సజ్జల రామకృష్ణారెడ్డికి సంచులు ఇస్తే ఏ పనైనా ఇట్టి అయిపోతుందని ప్రజలందరూ ఇదే చర్చించుకుంటున్నారు. గత ఏడాది కొడాలి నాని చెరువులు వద్ద ఏర్పాటు చేసిన పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు చేశారనే అక్కసుతోనే పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రభుత్వ పెద్దల మద్దతుతోనే గుడివాడ నడిబొడ్డున గుడారాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే క్యాసినోవా సెంటర్లు ఏర్పాటు చేయడం పేకాట శిబిరాలు నడిపించడం చీర్ గర్ల్స్ తో చిందులు వేయించడమ సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రం ఎటువైపు పోతుంది. పండగ ముసుగులో సంస్కృతి సంప్రదాయాలను సర్వనాశనం చేస్తున్నా మంత్రి కొడాలి నాని లాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళితే మీరు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం. మంత్రి కొడాలి నాని వారి అనుచరులు పై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మహేష్ డిమాండ్ చేశారు .