కోడికత్తి డ్రామాకి నేటికి 5 వసంతాలు

రాజోలు నియోజకవర్గం: ముమ్మిడివరం నియోజకవర్గం, ఠానేలంక గ్రామానికి చెందిన జనుపల్లి శ్రీనివాస్ (కోడికత్తి శ్రీను)ను అరెస్టు చేసి నేటికీ ఐదు సంవత్సరాలు పూర్త అయినా ఎటువంటి పురోగతి లేకుండా, నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఒక యువకుడిని ఐదు సంవత్సరాల నుండి అంధకారంలో జైల్లో మగ్గిస్తూ దళితుల మేనమామ అని చెప్పుకునే జగన్ రెడ్డి చేసిన పాపానికి శ్రీను కుటుంబం పడుతున్న ఆవేదనను తెలుసుకొని రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు గారు వారి కుటుంబానికి బాసటగా నిలబడి, రాజ్యాంగం ఇంకా బ్రతికే ఉంది అని వారికి ధైర్యాన్ని చెప్పి, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని అందజేసి, వారి కుటుంబానికి పదివేల రూపాయలు ₹10,000 ఆర్ధిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి చేసే మోసాలను, ముఖ్యంగా దళితులకు మేనమామ అని చెప్పుకుని మొదటిగా ఈ జనపల్లి శ్రీను (కోడికత్తి) తో మొదలుపెట్టి ఈరోజు వరకు దళితులకు చేస్తున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, దళితులతోనే వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని ఓడిస్తామని డాక్టర్ రమేష్ బాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం మండల జనసేన అధ్యక్షులు మల్లెపూడి సత్తిబాబు, జనసేన నాయకులు గొల్లమందల పూర్ణ భాస్కర రావు, ఉండపల్లి అంజి, రాపాక మహేష్, సర్పంచ్ కాకర్ శ్రీను, మలికిపురం మండల ఉపాధ్యక్షులు కుసుమ నాని, ప్రధాన కార్యదర్శి నల్లి పవన్ ప్రసాద్, రాజోలు మండల ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శనం, జనసేన పార్టీ ముమ్మిడివరం మండల ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగింది.