వివక్షకు తావు లేకుండా ప్రతి భారతీయుడికి సముచిత హక్కులు కల్పించేలా భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని కోడుమూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆకెపోగు రాంబాబు, చిన్న, ప్రకాష్, కిరణ్, హనుక్కు, మహిళా నాయకులు మరియమ్మ, సుభద్రమ్మ, రవణమ్మ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సమానత్వం, న్యాయం సాధించే దిశగా మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం జనసేన కార్యకర్తల ఉత్సాహంతో ఎంతో భక్తిశ్రద్ధలతో జరిగింది.
Share this content:
Post Comment