హిందూపురం పట్టణ అధ్యక్షుడుగా కొల్లకుంట చంద్రశేఖర్ నియామకం

ఉమ్మడి అనంతపురం జిల్లా, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుల నియామకానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ హిందూపురం పట్టణ అధ్యక్షుడుగా బోయ సామాజిక వర్గానికి చెందిన కొల్లకుంట చంద్రశేఖర్ నియమించడం జరిగింది.. ఈ సందర్బంగా హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ మాట్లాడుతూ.. నాపై ఎంతో నమ్మకంతో హిందూపురం పట్టణ అధ్యక్షుడు నియమిచినందకు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడు టి.సి వరుణ్ గారికి, హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా హిందూపురం పట్టణంలో జనసేన పార్టీ అభివృద్ధి కి కృషిచేస్తానని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా కొల్లకుంట శేఖర్ తెలిపారు.