జనసేన అర్బన్ పార్టీ సమన్వయకర్తగా కోన తాతారావు

  • పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్న కోన
  • పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ముందుకు వెళ్తామని ప్రతిజ్ఞ
  • కొనను ఘనంగా సత్కరించిన డాక్టర్ కందుల

విశాఖపట్నం జిల్లా అర్బన్ జనసేన పార్టీ సమన్వయకర్తగా జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు కోన తాతారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కోన తాతారావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కోనతాతరావు మాట్లాడుతూ పార్టీ తనకు ఏ బాధ్యతను అప్పగించిన దానిని క్రమశిక్షణతో కచ్చితత్వంతో నిర్వహిస్తానని చెప్పారు.
పార్టీ పట్టిష్టతకు అహర్నిశలు పనిచేస్తానని పేర్కొన్నారు.
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పని చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార మార్పు తప్పదని చెప్పారు. డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ కొన తాతారావుకు విశాఖపట్నం జిల్లా అర్బన్ జనసేన పార్టీ సమన్వయకర్త గా నియమించడం చాలా సంతోషకరమైన విషయం అని తెలిపారు. పార్టీలో ఇటువంటి వ్యక్తులకు సరైన అవకాశాలు లభిస్తే మరింత మంది యువత స్ఫూర్తిదాయకంగా పార్టీ కోసం పనిచేసే పార్టీ విజయానికి కృషి చేస్తారని అన్నారు. కోన తాతారావు చాలా మంచి వ్యక్తని అతని పార్టీ గుర్తించి ఈ అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.