శంకర్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

తెలంగాణ, తాండూరు నియోజకవర్గం: నియోజకవర్గ ఉమ్మడి బిజెపి జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీ, సీనియర్ బిజెపి నాయకులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొని భద్రేశ్వర్ చౌక్ లో గల పలు దుకాణాల యజమానులతో కలిసి జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్ కు మీ అమూల్యమైన ఓటు వేసి శంకర్ గౌడ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తాండూరు పలు అభివృద్ధి పనులలో వెనుకబడి ఉందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసింది ఏం లేదని విమర్శించాడు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్, మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్ అర్చన, కౌన్సిలర్లు అంతారం లలిత, బాలప్ప, బంటారం భద్రేశ్వర్, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, జనసేన కార్యకర్తలు రామన్న, రవీందర్, రాజ్ కుమార్, పవన్, అమ్రేష్ తదితరులు పాల్గొన్నారు.