కొండపి జనసేన ఐటీ వింగ్ సమావేశం

  • కొండపి జనసేన పార్టీకి మద్దతుగా ఉంటామని ఐటీ ఉద్యోగస్తుల హామీ

కొండపి నియోజకవర్గం, ప్రకాశం జిల్లాలో జనసేన ఐటీ వింగ్ సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశం కొండపి నియోజకవర్గం ఐటీ వింగ్ కోఆర్డినేటర్ మేడిద శివరామయ్య అధ్యక్షతన సింగరాయకొండలో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ 6 మండలాల అధ్యక్షులు కూడా పాల్గొనడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా మేడిద శివరామయ్య మాట్లాడుతూ.. కొండపి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇప్పటివరకు దాదాపు 5, 6 ఐటి ఉద్యోగస్తులను జనసేన పార్టీకి పరిచయం చేయడం జరిగింది, వారు పార్టీకి అన్ని విధాలుగా మద్దతుగా ఉన్నారు, జనసేన పార్టీకి మీడియాగానీ, న్యూస్ పేపర్ గాని సపోర్ట్ లేదు, మేమే ఒక న్యూస్ పేపర్, ఒక న్యూస్ ఛానల్ అయి పార్టీ కోసం పనిచేస్తాం, 2024 లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడం మా లక్ష్యం. పిల్లిపోగు పీటర్ బాబు (పొన్నలూరు మండలం ఐటీ వింగ్ అధ్యక్షులు) మాట్లాడుతూ.. నిరంతరం మా వంతుగా మేము జనసేన పార్టీకి మద్దతుగా ఉంటాము. పొన్నలూరు మండలంలో ఉన్న ఐటీ ఉద్యోగస్తులు అందరిని ఒక టీం గా తయారుచేసి, అన్ని విధాలుగా వారికి నేను అండగా ఉంటాను, అలాగే కొండపి నియోజకవర్గం స్థాయిలో కూడా అన్ని విధాలుగా నా సహాయ సహకారాలు కచ్చితంగా చేస్తాను.. ప్రతి మండలం అధ్యక్షులు చేసే ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మాధ్యమాల్లో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేస్తాను, జనసేన పార్టీ ప్రతి పేదవాడికి అండగా ఉంటుంది. ప్రతి సామాన్యమైన వ్యక్తి అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ కచ్చితంగా అధికారంలోకి రావాలి. 2024 లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడమే మా ప్రధమ లక్ష్యం. కొండపి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను తెలుసుకొని పార్టీ అధిష్టానం దృష్టికి తెలియజేయడం జరుగుతుంది. ఆరు మండలాల అధ్యక్షులు మాట్లాడుతూ కొండపి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను ఐటీ వింగ్ అధ్యక్షులకు తెలియజేయడం జరిగింది. మేము అన్ని విధాలుగా ఐటి వింగ్ అధ్యక్షులకు మద్దతుగా ఉంటాము. మేము పోరాడే ప్రతి సమస్యను ఐటీ వింగ్ వారి దృష్టికి తీసుకెళ్తాము. మనమందరం ఒక్కటిగా పోరాడి 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేద్దాము అని తెలియజేసారు. ఈ సమావేశంలో అయినబత్తిన రాజేష్ (సింగరాయకొండ), కనపర్తి మనోజ్ కుమార్ (పొన్నలూరు), గూడ శశిభూషణ్ (జరుగుమల్లి), విశ్వనాగ బ్రహ్మ (కొండపి), కందుకూరి రాంబాబు (టంగుటూరు), చంద్రశేఖర్ (మర్రిపూడి), లేటి కేశవరావు (గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్), కాసుల శ్రీనివాస్, కిరణ్ బాబు, చాంద్ బాషా, శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.