రాయపాటి అరుణని కలిసిన కొండేపి జనసేన నాయకులు

కొండెపి: జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణని మర్యాదపూర్వకంగా కలిసిన కొండేపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం జనసేన నాయకులు. ఈ సందర్భంగా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలంలో పటిష్టమైన క్యాడర్‌ను ఎలా నిర్మించుకోవాలనే దానిపై సలహాలు మరియు సూచనలు తీసుకున్నారు. వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ లో మండలం జనసేన పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలో అనే దానిపై సలహాలు తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మండల సమన్వయ కర్త పిల్లిపోగు పీటర్ బాబు, మండలం ఉపాధ్యక్షుడు పెయ్యల రవి యాదవ్, మండల ఉపాధ్యక్షులు కర్ణ తిరుమల రెడ్డి, సుబ్రహ్మణ్యము నాయుడు, మండల ప్రధాన కార్యదర్శులు సి.హెచ్ భాషా, షేక్ మహబూబ్ బాషా, లక్ష్మణ్, సుంకేశ్వరం శ్రీను, పులి రాజేష్ మొదలగువారు పాల్గొన్నారు.