*విద్యార్థులు సాధిస్తున్న అద్భుత విజయాలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది
*చదువుని మించిన సంపద… విద్యకు సరి తూగగల ఐశ్వర్యం సృష్టిలో లేవు
*జనసేన రాష్ట్ర నాయకులు, శాసనమండలి సభ్యులు కొణిదెల నాగేంద్రబాబు
గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి కుమార్తె ఆళ్ళ యామినీ విద్యాధరి పదవ తరగతిలో 600కి 594 మార్కులు సాధించిన సందర్భంగా యామినీ విద్యాధరికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు అభినందనలు తెలిపి ఆశీస్సులు అందచేశారు. గురువారం ఓ ప్రముఖ హోటల్లో నాగబాబుని ఆళ్ళ హరి, శిరీష దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నాగబాబు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా విద్యార్థులు సాధిస్తున్న విజయాలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందన్నారు. ముఖ్యంగా చదువులో ఆడపిల్లలు సాధిస్తున్న అనితర సాధ్యమైన విజయాలను చూస్తుంటే గర్వకారణంగా కూడా ఉంటుందన్నారు. చదువుని మించిన సంపద, విద్యకి సరితూగగల ఐశ్వర్యం లేదన్నారు. తల్లితండ్రులు ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారని, వారి కష్టాలకు తగ్గట్టుగా విద్యార్థులు బాగా చదవాలని కోరారు. ఆళ్ళ హరి మెగాఫ్యామిలీకి వీరాభిమాని అని, మా అభిమాన కుటుంబ సభ్యుల్లో రికార్డు స్థాయి మార్కులు సాధించటం వ్యక్తిగతంగా తనకి ఎంతో ఆనందంగా ఉందని నాగబాబు పేర్కొన్నారు.
Share this content:
Post Comment