ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ లాంచ్ చేసిన కొరికాన రవి కుమార్

నరసన్నపేట, ఈనెల 14న పిఠాపురంలో ఘనంగా జరగనున్న 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన పాస్టర్ ని శుక్రవారం నాడు నరసన్నపేట నియోజకవర్గంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త కొరికాన రవి కుమార్ మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు వీర మహిళలు, జనసైనికులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట పిఓసి బలగ ప్రవీణ్, వీరమహిళలు లావేటి బుజ్జమ్మ, రావనమ్మ, యాబాజీ కుర్మరావు, వెను నాయుడు, శ్రీధర్, ముద్దాడ సింహాచలం, చలపతి, అసిరి నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment