కోటనందూరు జనసేన ఆత్మీయ సమావేశం

తుని, గ్రామాలలో జనసేన పార్టీ బలోపేతంలో భాగంగా శుక్రవారం రాత్రి బొద్దవరం గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామ జనసైనికులు జనసేన నాయకులతో గ్రామ కమిటీ ఏర్పాటు, కార్యక్రమాల నిర్వహణ, తదితర విషయాల గూర్చి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో కోటనందూరు మండల సీనియర్ యువ నాయకులు ప్రవీణ్ కుమార్, మండల కార్యదర్శి అభిషేక్, అంకాడ్డి రాజశేషు, గ్రామ యువ నాయకులు సురేష్, శ్రీనివాస్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.