కొత్తపల్లి జనసేనలోకి చేరిన వైస్సార్సీపీ కీలక నేత

కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో ఎన్నోఏళ్లుగా వైస్సార్సీపీ కీలకనేతగా వ్యవహారిస్తూ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన కొత్తపల్లి గ్రామంలోని కొనాల మరియదాసు ఆ పార్టీని వీడారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షతులై జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరారు. జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ కండువాకప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా మరియదాసు మాట్లడుతూ ఎన్నో ఏళ్లుగా పార్టీ కీలకనేతగా వ్యవహారించాను, తాను అనుకున్నట్టుగా నా ప్రజలకి పార్టీ అధికారంలోకి వచ్చాక తగు న్యాయం చేయడంలో విఫలం అవ్వడంతో అది యొక్క జనసేన పార్టీతోనే సాధ్యమవుతుంది అని పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యలపై బలంగా పోరాటం చేయడంతో ప్రతి సమస్యకు మార్గం చూపుతున్నారు అందుకే జనసేన పార్టీలో చేరాను అని తెలిపారు. ముదినేపల్లి మండలం అధ్యక్షులు వీరంకి వెంకయ్య మాట్లడుతూ కొనాల మరియదాసు మంచి నాయకుడు అని గ్రామస్థాయిలో తాను చేసిన పోరాటం గొప్పది, ఇలాంటి నాయకుడు జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషకరం అని అన్నారు. కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, జనసేన నాయకులు మోటేపల్లి హనుమాన్ ప్రసాద్ మాట్లడుతూ కొత్తపల్లిలో జనసేనకి మరింత బలం ఏర్పడిందని జనసైనికులు చేస్తున్న పోరాటం చూసి పార్టీకి ఆకర్షతులై జనసేనలో చేరడం శుభపరిణామం అని ముందుముందు పార్టీని మరింత బలంగా సమన్యయంతో ప్రజలోకి తీసుకుని వెళ్ళాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ముదినేపల్లి మండలం అధ్యక్షలు వీరంకి వెంకటేశ్వరరావు, కృష్ణాజిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, జనసేన నాయకులు మోటేపల్లి హనుమాన్, మండల నాయకులు, కొత్తపల్లి జనసైనికులు పాల్గొన్నారు.