నిర్వాణ రిసార్ట్ ను సందర్శించిన కొత్తపల్లి గీత

పాడేరునియోజకవర్గం: జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య ఇటీవలే నూతనంగా ప్రారంభించిన నిర్వాణ రిసార్ట్ బీజేపీ నాయకులు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత సందర్శించారు. ఈ సందర్బంగా బీజేపీ నాయకులు జనసేన పార్టీ నాయకులతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా వైసీపీ వైరస్ ను తరిమికొట్టడానికి మనమందరు కలిసికట్టుగా ప్రయాణం చేద్దామని, ప్రస్తుత గిరిజన ప్రాంత సమస్యలపై సుదీర్ఘ చర్చ చేశారు. ఈ సందర్బంగా బీజేపీ నేతలు పాంగి రాజారావు, కూడా కృష్ణారావు, రవికుమార్, జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, డా. రఘు జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య, తదితర నాయకులు పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, పెదబయలు మండల అధ్యక్షులు పవన్ కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.