నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన కొత్తపేట అబ్బాయి కాపు తనయుడు
కొత్తపేట నియోజకవర్గానికి చెందిన నాయకులు, రాష్ట్ర కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, కొత్తపేట మాజీ సర్పంచ్ కీ.శే. సలాది స్వామి నాయుడు(అబ్బాయి కాపు) తనయుడు కొత్తపేట గ్రామ మాజీ వైస్ ప్రెసిడెంట్ సలాది రామకృష్ణ శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాకినాడలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఆయనతో పాటు సలాది వెంకటేశ్వరరావు, వాడపల్లి వీరబాబు, సూరంపూడి ఆనంద్, సలాది నాగేశ్వరరావు, కంఠంశెట్టి వెంకటేశ్వరరావు కూడా జనసేన పార్టీలో చేరడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-26-at-7.21.49-PM-1024x519.jpeg)