కొత్తపేట జనసేనలో భారీ చేరికలు

  • జనసేన పార్టీలోకి భారీ చేరికలతో తిరుగులేని నేతగా నిలిచిన బండారు శ్రీనివాస్

కొత్తపేట, జనసేనాని ఆశయాలు నచ్చి భారీగా చేరిన ఆత్రేయపురం మండలం, నార్కెడిమిల్లి ఎస్సి, బిసి సామాజికవర్గం వారితో పాటు కాపు సామాజికవర్గానికి చెందిన గ్రామస్తులు ఆత్రేయపురం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు నాయకత్వంలో, ప్రముఖ జనసేన నాయకులు బెజవాడ సతీష్ ఆధ్వర్యంలో, బండారు శ్రీనివాస్-నియోజకవర్గ ఇన్చార్జ్ సమక్షంలో బుధవారం జనసేన పార్టీలో భారీగా చేరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆత్రేయపురం మండలం, నార్కెడిమిల్లి గ్రామానికి చెందిన వైసిపి,టిడిపి పార్టీ నాయకులు, ఎస్సీ సామాజిక వర్గానికి మరియు బిసి సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు వారి అనుచరులతో భారీగా బుధవారం జనసేన పార్టీలోకి కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి, జనసేన ప్రముఖ నాయకులు బండారు శ్రీనివాస్ సమక్షంలో చేరికలు జరిగాయి. ఆత్రేయపురం మండలం నుంచి విశేషంగా గత కొద్ది రోజుల నుంచి భారీగా చేరికలు జరుగుతుండడం చూసి, జనసేన పార్టీ నాయకులు బండారు శ్రీనివాస్ ఎంతో సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జనసేనాని లాంటి గొప్ప నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమని, రేపటి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే గొప్ప నాయకుడు నిజాయితీపరుడైన జనసేనాని మాత్రమేనని, ఈ రాష్ట్రానికి దశ-దిశా చూపించగలరని ప్రజలు నమ్ముతూ జనసేనాని ఆశయాల పట్ల ఆకర్షితులై ప్రజల్లో మార్పు మొదలైందని ఈ మధ్యకాలంలో ఈ భారీ చేరికలే దీనికి నిదర్శనమని బండారు శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్ రాజ్, కార్యదర్శులులు బొక్క ఆదినారాయణ, దొంగ సుబ్బారావు, సంగీత సుభాష్, ఆలమూరు మండల అధ్యక్షులు సురపురెడ్డి సత్య, కొత్తపళ్లి నగేష్, సలాది జయ ప్రకాశ్ నారాయణ (జె.పి) మరియు ఆత్రేయపురం మండల పలువురు ప్రముఖ నాయకులు, రావులపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట స్వామి మరియు కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ప్రముఖ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు అభిమానులు పాల్గొన్నారు.