శ్రమదాన కార్యక్రమం లో పాల్గొనకుండా దెందులూరు జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు గృహ నిర్బంధం..!

జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొఠారు ఆదిశేషు దెందులూరు నియోజకవర్గ 4 మండలాలలో తలపెట్టిన అధ్వానంగా మారిన రోడ్లను పూడ్చే కార్యక్రమాలను జరగనివ్వకుండా మరియు ఆ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దెందులూరు జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు ను అడ్డుకుంటున్న పోలీసులు. కొఠారు ఆదిశేషు మాట్లాడుతూ సెప్టెంబరు 2వ తారీఖున జనసేనపార్టీ చేసినటువంటి #JSPforAP_ROADS క్యాంపైన్ కు అప్పుడే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇటువంటి అవసరం వచ్చేది కాదని, ఇలాంటి గృహనిర్భందాలు చేసి జనసైనికులను ఎవరూ ఆపలేరని అన్నారు.