మిట్ట వంశీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కొట్టె మల్లికార్జున

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ వయసులో బిజెపి యువ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు యువ మోర్చ అధ్యక్షులుగా ఎన్నికై చరిత్ర సృష్టించిన మిట్ట వంశీకి బిజెపి యువ మోర్చ నాయకులు కొట్టె మల్లికార్జున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొట్టె మల్లికార్జున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, మరియు యువ మోర్చ రథసారథి మిట్ట వంశీ నేతృత్వంలో ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. మిట్ట వంశీ నేతృత్వం ఎంతో మంది యువతకు మరియు బిజెపి యువ మోర్చ నాయకులకు ఆదర్శంగా నిలిచిందని, వారి నాయకత్వంలో ప్రజా సంక్షేమం కోసం పని చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో విద్య, ఉద్యోగ అవకాశాల కోసం, హిందూ దేవాలయాలపై దాడులపై ఎన్నో ఉద్యమాలు చేశామన్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల ముందు మోడీ జీ పిలుపు మేరకు “వన్ నేషన్ వన్ ఎలక్షన్” కు మద్దతుగా, “నా మొదటి ఓటు నరేంద్ర మోడీకి, నా మొదటి ఓటు భారతదేశ అభివృద్ధి కోసం” కార్యక్రమాన్ని మిట్ట వంశీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించామని, మూడవసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంలో మరియు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పేద, మధ్యతరగతి ప్రజలందరికీ చేరేలా మిట్ట వంశీ నేతృత్వంలో యువ మోర్చ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేస్తున్నామని కొట్టె మల్లికార్జున అన్నారు.

Share this content:

Post Comment