కేటీపీఎస్ యాజమాన్యం అన్యాయం చేసింది!!

తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం, కేటీపీఎస్ నందు హయర్ వెహికల్ డ్రైవర్లు గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2016 అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు కేటీపీఎస్ కర్మాగారంలో ఎవరైతే కార్మికులు విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ ఆర్టిషన్ గా గుర్తించడం జరిగింది. ఆ ప్రక్రియలో హయ్యర్ వెహికల్ డ్రైవర్స్ కు కేటీపీఎస్ యాజమాన్యం అన్యాయం చేసింది. ఆర్టిషన్లుగా గుర్తించడానికి యాజమాన్యం ఏవైతే విధివిధానాలను అర్హతలను రూపొందించిందో అటువంటి అన్ని అర్హతలను ( గేట్ పాస్, ఈపీఎఫ్, అగ్రిమెంట్, అన్యువల్ మెయింటెనెన్స్) వీరు కలిగి ఉన్నారు. ఇలా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఈరోజు వరకు కేటీపీఎస్ యాజమాన్యం వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయానికి గురిచేస్తుంది. ఈ విషయమై ఈరోజు కెటి ఆర్ ను కలవడానికి వెళితే బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు వారి వద్ద ఉన్న ఫ్లకార్డులను చింపివేసి మమ్ములను చొక్కా పట్టుకుని తోసివేయడం జరిగింది. వారి ఆవేదనను అర్థం చేసుకొని సమస్యను సహకరించగలరని కోరుచున్నామని దేవా గౌడ్, అబ్దుల్, సురేందర్, వెంకటేష్ తెలిపారు.