జీడబ్ల్యూఎంసీకి కేటీఆర్‌ అభినందనలు

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ), సిబ్బందికి రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. జీడబ్ల్యూఎంసీ అందమైన సైక్లింగ్‌ లేన్స్‌ను అభివృద్ధి చేసింది. దీనిపై మంత్రి ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. తక్కువ కాలుష్యం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్న జీడబ్ల్యూఎంసీకి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌తో పాటుగా రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, నగరాల్లోనూ ఇటువంటివి అవసరమని మంత్రి పేర్కొన్నారు.