భైంసాలో హింసపై స్పందించిన కేటీఆర్

హైదరాబాద్: నిర్మల్ జిల్లాలోని భైంసాలో రెండు వర్గాల మధ్య మరోసారి గొడవ చెలరేగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘నాగరిక సమాజ పురోగతి కోసం శాంతి, సామరస్యాలే మూలం. భైంసాలో హింసాత్మక ఘటనకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్ అలీ గారిని, డీజీపీ మహేందర్ రెడ్డిగారిని కోరాను. వేర్పాటవాద శక్తులు వ్యాప్తి చేసే వదంతులను నమ్మకూడదని, వారి విద్వేషపూరిత కుట్రల ఉచ్చులో పడకూడదని భైంసా ప్రజలను కోరుతున్నాను. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ మీకు అండగా ప్రభుత్వం ఉంటుంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.