సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు. అప్పర్ మానేరు ప్రాజెక్టు చరిత్రలో మొట్టమొదటిసారి వర్షాకాలంలో పంటలకు నీరు అందుతున్న సందర్భంలో సిరిసిల్ల రైతాంగం తరపున సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ జలాలతో వేసవిలోనే అప్పర్ మానేరు నిండింది. 2.2 టిఎంసీ ల నీటితో ప్రాజెక్టు జల కళను సంతరించుకొంది. సీఎం కేసీఆర్ కార్యదక్షతతో వానకాలం పంటకు నీళ్ళు వచ్చాయి అని కేటీఆర్ పేర్కొన్నారు. జూలై మొదటి వారంలో అప్పర్ మానేరు నీటి విడుదలకై ఇరిగేషన్ అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల ప్రాంతం ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలు నిజం అవుతుండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.