కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించాలి

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించాలని మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం లీగల్ సెల్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నాగేంద్ర, నికిత మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం సీటు గురించి బిజెపి నాయకులు మరియు జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడారని నియోజకవర్గంలో జనసేన పార్టీకి క్యాడర్ లేదని ఓటర్ లేడని అనడం సబబు కాదని, కార్పొరేటర్ ఎలక్షన్ లో మా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారని నామినేషన్ వేసిన వారందరూ విత్ డ్రా అయ్యి బిజెపికి మద్దతు ఇచ్చామని అన్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు మాట్లాడుతూ జనసైనికులు ప్రతి ఇంటింటా ఉన్నారని మా ఓటు ప్రతి ఒక్క కుటుంబంలో ఉందని ఇలాంటి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడొద్దని తెలియజేశారు మా అధిష్టానం నిర్ణయిస్తే జనసేన పార్టీ లేక బిజెపి పార్టీకి కేటాయించినా నిస్వార్ధంగా మేము పొత్తు ధర్మం పాటిస్తామని అదేవిధంగా బిజెపి నాయకులు కూడా పాటించాలని కోరారు . ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం నాయకులు కొల్లా శంకర్, వెంకటేశ్వరరావు, వేముల మహేశ్వరరావు, పసుపులేటి ప్రసాద్, సలాది శంకర్, కలిగినీడి ప్రసాద్, పండుగ సూర్య ముదిరాజ్, భరత్ గౌడ్, రఘు, సుబ్బు, సత్య సాయి, అంజి, రాము, రతన్, నికిత్, కిరణ్ మరియు వీర మహిళ శిరీష తదితరులు పాల్గొన్నారు.