ఖనిజ సంపదను నాయకులకు, వ్యాపారులకు ఎరగా చూపించి పదవి పొందిన కుంభ రవిబాబు: చిట్ట మురళి

అల్లూరి సీతారామరాజుజిల్లా, పాడేరు డివిజన్, ఏజెన్సీ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో యున్న అమాయక ఆదివాసీ గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మైదాన ప్రాంత వాసి కుంభ రవిబాబు పదవి పొంది ఉన్నారని ప్రజా సంఘాలు, గిరిజన ప్రజాప్రతినిధులు ఆదివారం పత్రికా ప్రకటనలు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న గిరి ప్రజలకు ఖనిజ సంపద మీద మరియు మైనింగ్ పై గాని ఏజెన్సీ గిరిజన చట్టాలపై అవగాహన లేకపోవడం కుంభ రవిబాబుకి బాగా కలిసి వచ్చినట్లు ఉన్నదని పలువురి నోట గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి పదవీ వ్యామోహం తోనే యూనివర్సిటీలో ఆధ్యాపకుని ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. గిరిజనుల బతుకులు బాగు చేయడానికా..? గిరి సంపద దోచుకు పోవడానికా అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనులు వారు సాగుచేసుకుంటున్న సాగు భూములు ఎవరైతే సాగులో ఉన్నారో ఆ భూముల మీద సర్వ హక్కులు గిరిజనులకు మాత్రమే ఉంటుంది.. కానీ ఇక్కడ వారికి బినామీలను తయారుచేసి మైనింగ్ మాఫియాతో రవిబాబు చేతులు కలిపి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బంధువు అయిన మేఘనాథ్ రెడ్డి కి ఏజెన్సీ ప్రాంతంలో పంపించి గిరిజనులకు భయబ్రాంతులకు గురి చేస్తూ.. అక్రమ మైనింగ్ తీస్తున్నారని గిరిజన ప్రజా సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అమాయక ఆదివాసి గిరిజనులకు కార్మిక చట్టాలపై గాని.. పీసా చట్టం ఒకటి బై 70 చట్టం ఉపాధి చట్టాలపై అవగాహన లేకపోవడం.. వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆశ చూపించి వారిని పావులుగా వాడుకుంటూ.. రవిబాబు మాత్రం చీకటి సంపాదనతో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు అని ప్రజాసంఘాలు తెలుపుతున్నాయి. విషయం తెలిసిన కొంతమంది ఇది అన్యాయం అని అడిగితే.. వారిపై దౌర్జన్యాలకు దిగి బెదిరించి వారిని రాజకీయ బలంతో అణిచి వేసి నోరు ముయ్యిస్తున్నారు. భూమి మీద సర్వహక్కులు పొంది సాగుచేస్తున్న గిరిజనులకు మాత్రం అన్యాయం జరుగుతుంది అని అన్నారు. ఏ.పీ.ఎం.డీ.సీ అధికారులు రాజకీయ నాయకుల దగ్గర ముడుపులు పుచ్చుకుని గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ గిరిజనుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారని ప్రకటనలో తెలిపారు. నిమ్మలపాడు కాల్ సైట్ మైనింగ్ క్వారీ నీ తక్షణమే నిలుపుదల చేయకపోతే ప్రజా ఉద్యమాలు, నిరాహార దీక్షలు చేస్తామని గిరిజన ప్రజా సంఘాలు, గిరిజన ప్రజా నాయకులు ఓ ప్రకటనలో హెచ్చరిస్తున్నారు.