ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తిన లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం, డీఎస్సీ అభ్యర్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు పెట్టడాన్ని తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వము అధికారంలోకి రాగానే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 10 నెలలు అవుతున్నప్పటికీ మెగా డీఎస్సీ ఇవ్వకపోగా? కంటి తుడుపు చర్యగా ఎన్నికల ముందర హడావుడిగా కేవలం 6100 పోస్ట్ కు నోటిఫికేషన్ ఇచ్చి డీఎస్సీ అభ్యర్థులందరినీ నిరాశకు గురిచేసిన జగన్మోహన్ రెడ్డి. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా తెచ్చిన జీవో 117 తక్షణమే రద్దు చేయాలి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది డీఎస్సీ విద్యార్థులు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నారు. నిరుద్యోగ డీఎస్సీ విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందర ఇచ్చిన హామీలలో 99% నెరవేర్చించినాను అంటున్నారు? ఈ హామీలన్నీ 99% లో ఉన్నాయా? లేదంటే మిగిలిన 1% లో ఉన్నాయా?, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు ఎప్పుడు పూర్తి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు?, ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నారు ఇచ్చారా?, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తాను అన్నారు చేశారా?, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించారా?, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఇంకెప్పుడు పరిష్కరిస్తారు?, మద్యపాన నిషేధం అంటివి ఏమైంది?, ఇలాంటి సమస్యలు ఇంకెన్నో ఉన్నాయి ఇవన్నీ 1% లోనే ఉన్నాయా? అంటూ అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.