కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి: నలిశెట్టి శ్రీధర్

రాష్ట్రంలో, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డిఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లడం జరిగింది. అనంతరం ఆర్డీవో గారికి జనసేన పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ అత్యంత పేదరికంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా దామోదరం సంజీవయ్య ఎదిగారని చెప్పారు. సంజీవయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో, కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని సంజీవయ్య నిర్వహించారు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులని, కర్నూలు జిల్లాలోని ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తామని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. ఈ మేరకు స్మారక చిహ్నం కోసం రూ.కోటితో నిధి ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారన్నారు. వెనుకబాటుతనాన్ని రూపు మాపేందుకు బీజాలు వేశారు. సీఎంగా రెండేళ్లే ఉన్నా ఎన్నో పనులు చేశారు. హైదరాబాద్‌ పరిసరాల్లో 6 లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేశారు… వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు ప్రారంభించింది సంజీవయ్య గారే అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం. జరిగింది.